AP: మహానాడు కార్యక్రమాన్ని పండుగలా చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రెండు రోజుల ముందు నుంచి ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని అన్నారు. అగ్రనాయకత్వం నుంచి కార్యకర్త వరకు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని ఆదేశించారు. అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుల తర్వాత మహానాడు ప్రారంభించాలని చెప్పారు.