GDWL: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని తెలిపారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తారని, అర్హుల పేర్లు చేర్చి అనర్హుల పేర్లు తొలగిస్తారని వెల్లడించారు.