SDPT: తొగుట మండల బండారుపల్లి, గుడికందుల, గోవర్ధనగిరి, వరదరాజుపల్లి, ఘనపూర్లలో వరి కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ ఛైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి తనిఖీ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కేంద్రాల వద్దకు వచ్చి పార్టీ ఉనికి కోసం రైతులపై పినతల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అన్న నేతలు, నేడు ఆ విషయాలు మరిచిపోయారన్నారు.