SRD: పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం పటాన్చెరులో 42.1°, రామచంద్రపురంలో 42.1°, అమీన్పూర్లో 43.2°, జిన్నారంలో 43.8°, గుమ్మడిదలలో 42.4° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం 30.9%గా నమోదైంది. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచించారు.