NGKL: లింగాల మండలం అంబట్పల్లి శివారు సర్వే నం.471లోని ప్రభుత్వ పోరంబోకు భూమిని పక్క ఊరి వారికి కాకుండా, తమ గ్రామంలోని 20 నిరుపేద దళిత కుటుంబాలకు కేటాయించాలని మార్క్స్, బీఎస్పీ నాయకులు తహశీల్దార్ వెంకటేష్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరుపుతామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుడు బంగారయ్య పాల్గొన్నారు.