‘డ్రాగన్’లో NTR నెగెటివ్ షేడ్స్ ఉన్న ‘డార్క్ క్యారెక్టర్’లో కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఈ కథకు మూడేళ్లు పట్టిందని, NTR లాంటి స్టార్ ఇలాంటి రోల్ చేయడం పెద్ద రిస్క్ అని చెప్పాడు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ సాగుతుందని, ఎండ్ కార్డ్ పడేసరికి ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం ఖాయమన్నాడు. నటుడిగా కొత్తగా నిరూపించుకోవడానికే NTR ఈ భిన్నమైన పాత్రను ఒప్పుకున్నారని చెప్పాడు.