TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎస్, డీజీపీ ఆనంద్ పాల్గొన్నారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం వారికి నిర్ణయించారు. ఇదే సమయంలో నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.