SKLM: మెలియపుట్టి మండలం గొట్టిపల్లి గ్రామంలో విష జ్వరాలు కలకలం రేపాయి. ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి బుధవారం గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవోకు ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు.