MDK: పెద్ద శంకరంపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఛైర్మన్ సిద్ధ సంజీవరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం రైతులు పండించిన జొన్నలు క్వింటాల్‌కు రూ. 3,699 ధరను తీసుకుంటుందన్నారు. రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్, సీఈవో రవీందర్, నాయకులు పాల్గొన్నారు.