MDK: రామాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HMపై చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, వెంకట్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలలు ప్రారంభం రోజే విద్య కిట్లు అందజేయాలన్నారు. పీఆర్సినీ వెంటనే ప్రకటించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.