MNCL: పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుందని బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ బుధవారం తెలిపారు. 27 నుంచి 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, 29 నుంచి జూన్ 1వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 6 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.