KMM: పట్టణంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు బయో మెడికల్ వ్యర్థాలను తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు. వైరా రోడ్డు నుంచి ZP సెంటర్ వరకు ఉన్న ఆస్పత్రులు, ల్యాబ్స్ నుంచి సిరంజులు, సెలైన్లు, కాటన్ మెడికల్ వేస్ట్‌ను శివారు ప్రాంతాల్లోకి చెత్త ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.