BHNG: జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాల్లో జిల్లా పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలలు, కేజీబీవీలు, భవిత కేంద్రాలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల మరమ్మతు పనుల పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.