KNR: అనుమతుల పేరుతో మట్టి మాఫియా యథేచ్ఛగా చెరువుల నుంచి మట్టి తరలిస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. గంగాధర మండలంలోని కురిక్యాల చెరువును ఆయన పరిశీలించి పరిస్థితిని ఆరా తీశారు. ఇరిగేషన్, మైనింగ్ శాఖల అలసత్వమే చెరువుల నాశనానికి కారణమని ఆరోపించారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.