»Kotamreddy Sridhar Reddy Fires On Sajjala Ramakrishna Reddy
kotamreddy sridhar reddy:తగ్గేదేలే..! షాడో సీఎంగా సజ్జల: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
kotamreddy sridhar reddy:ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala ramakrishna reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ఫైరయ్యారు. తన అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు (case) పెట్టినా భయపడేదే లేదని చెప్పారు.
kotamreddy sridhar reddy:ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala ramakrishna reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ఫైరయ్యారు. తన అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు (case) పెట్టినా భయపడేదే లేదని చెప్పారు. సమస్యలపై పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. అనుచరులు తాటి వెంకటేశ్వర్లు (venkateshwarlu), జావెద్ (javed), రఘు (raghu) అరెస్టును ఖండిస్తున్నానని తెలిపారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా హైవేపై (highway) తిప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో షాడో సీఎం (shadow cm) ఉన్నారని.. సజ్జల సూచనల మేరకు పోలీసులు (police) పని చేస్తున్నారని ఆరోపించారు. తనతో సహా 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వివరించారు. పోలీసుల వేధింపులకు భయపడనని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని తగ్గేదే లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ (phone tapping) అంశాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ప్రస్తావించారు. సీఎం జగన్ (jagan) లక్ష్యంగా విమర్శలు చేశారు. దీంతో మంత్రులు, వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై (kakani govardhan reddy) శ్రీధర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సజ్జలను (sajjala) ఏమైనా అంటే ఊరుకోరు అని చెప్పారు. సీఎం జగన్‌ను (jagan) కామెంట్ చేసినా పట్టించుకోరని తెలిపారు. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవీ ఇప్పించిందే సజ్జల అని స్పష్టంచేశారు. మధ్యలో బోరుగడ్డ అనిల్ వచ్చి.. శ్రీధర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మీడియాముఖంగా శ్రీధర్ రెడ్డి.. అనిల్, సజ్జలను హెచ్చరించారు.
అంతకుముందు ఫోన్ ట్యాపింగ్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి లేఖ (letter) రాశారు. విచారణ జరపాలని అందులో హోం మంత్రి అమిత్ షాను (amith shah) కోరారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ట్యాపింగ్ చేశారని చెబితే వైసీపీ నేతలు/ ఎమ్మెల్యేలు తనపై మాటల యుద్దం చేశారని గుర్తుచేశారు. ఈ విషయంపై తేల్చుకునేందుకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.