AP: దక్షిణాది పట్ల వివక్ష ఉందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. ‘విపక్షాల తప్పుడు ప్రచారాన్ని అభివృద్ధిలో తిప్పికొడుతున్నాం. అన్నిరంగాల్లో దక్షిణాదికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. రైల్వేలు, హైవేలు, విద్యుత్, పోర్టులు అన్ని రంగాల్లోనూ భారీ పెట్టుబడులు. మోదీ సర్కారు అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పిస్తుంది’ అని చెప్పారు.