Taraka Ratna Health Update: విషమంగా తారకరత్న ఆరోగ్యం
నందమూరి తారకరత్న(Taraka Ratna) ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. తీవ్ర గుండెపోటుతో ఆయన బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు తారకరత్న(Taraka Ratna)కు చికిత్స అందిస్తున్నారు. నేటి సాయంత్రం హెల్త్ బులెటిన్(Health Bulletin)ను వైద్యులు విడుదల చేయనున్నారు.
నందమూరి తారకరత్న(Taraka Ratna) ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. తీవ్ర గుండెపోటుతో ఆయన బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తారకరత్న కోలుకుంటున్నట్లు అందరూ భావించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు తారకరత్న(Taraka Ratna)కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై మరో రకమైన సమాచారం అందుతోంది. కుప్పంలో గుండెపోటుకు గురైన వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. ఆ సమయంలో మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్సులో తారకరత్న(Taraka Ratna)ను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గత 20 రోజులకు తారకరత్నకు అక్కడే చికిత్స అందుతోంది.
బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న(Taraka Ratna) క్రమంగా కోలుకుంటున్నట్లు అందరూ భావించారు. మాజీ సీఎం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా నందమూరి ఫ్యామిలీ మొత్తం తారకరత్నను పరామర్శించారు. నందమూరి బాలయ్య అయితే తారకరత్న ఆరోగ్య చికిత్స విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తారకరత్న(Taraka Ratna) ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ వస్తున్నారు. వైద్యుల సమాచారం మేరకు తారకరత్న(Taraka Ratna) గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడ్డారని, అయితే మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. ఇందుకోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా న్యూరో వైద్యులను కూడా పిలిపించారు. వారు తారకరత్నకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు.
జనవరి 27వ తేదిన కుప్పంలో నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపట్టారు. ఆ సమయంలో ఆ యాత్రలో పాల్గొన్న తారకరత్న(Taraka Ratna) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడుకు సంబంధించి నీరు అధికంగా ఉండటంతో వాపు ఏర్పడినట్లు గుర్తించారు. అందుకే వైద్యులు అది తగ్గించేందుకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. దీనికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్(Health Bulletin) కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తారకరత్న(Taraka Ratna) ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్(Health Bulletin) విడుదల చేయనున్నారు. అందులో చికిత్స, తారకరత్న స్పందిస్తున్న తీరుపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్న(Taraka Ratna) కు ప్రస్తుతం చికిత్స నిలకడగానే సాగుతోంది. గురువారం ఆయనకు ఎమ్మారై స్కానింగ్ కూడా చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుం మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. నేటి సాయంత్రం హెల్త్ బులెటిన్(Health Bulletin)ను వైద్యులు విడుదల చేయనున్నారు.