»Bjp Mla Jayanarayan Mishra Misbehave With Women Police Officer
Odisha చెంప పగులుతది.. మహిళా సీఐపై రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే
ఈ సమయంలో ఎమ్మెల్యే ‘లంచగొండి, బందిపోటు నువ్వు. నీ చెంప పగలగొడతా’ అంటూ ఆమెకు చేయి చూపించాడు. ఏమిటా మాటలు అని సీఐ అనిత నిలదీయగా చేయి వేసి ఎమ్మెల్యే నెట్టి వేశాడు. దీంతో తోటి పోలీసులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రజా ప్రతినిధులు సంయమనం పాటించడం లేదు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. కోపమొస్తే అక్కడ ఉన్నది ప్రజలా? అధికారుల అని తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా దాడులకు ఎగబడుతున్నారు. ప్రజాస్వామ్యంలో పరిణతితో రాజకీయాలు చేయాల్సిన నాయకులు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒడిశా (Odisha) రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై దాడులకు పాల్పడ్డాడు. చెంప పగులుతది అని చేయి చూపిస్తూ దుర్భాషలాడాడు. అనంతరం మహిళా పోలీస్ (Women Police)పై చేయి వేసి నెట్టి వేశాడు. ఈ దారుణ సంఘటనపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. మహిళా పోలీసులతో ఎలా వ్యవహరించాలో తెలియని వ్యక్తి ఎమ్మెల్యే అని విమర్శించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశాలో శాంతిభద్రతలు బాగా లేవని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం సంబల్ పుర్ కలెక్టర్ (Sambalpur District Collectorate) కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. కలెక్టరేట్ ముట్టడి చేపట్టడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. పోలీసులు బీజేపీ నాయకులను రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ సమయంలో బీజేపీ నాయకులు కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ధనుపాలి సీఐ అనితా ప్రధాన్ తో బీజేపీ సంబల్ పూర్ ఎమ్మెల్యే (Sambalpur MLA) జయనారాయణ్ మిశ్రా (JayaNarayan Mishra) వాగ్వాదానికి దిగాడు. అడ్డుకుంటున్న ఆమెతో దుర్భాషలాడాడు. ఈ సమయంలో ఎమ్మెల్యే ‘లంచగొండి, బందిపోటు నువ్వు. నీ చెంప పగలగొడతా. ఏమనుకున్నావ్’ అంటూ ఆమెకు చేయి చూపించాడు. ఏమిటా మాటలు అని సీఐ అనిత నిలదీయగా చేయి వేసి ఎమ్మెల్యే నెట్టి వేశాడు. దీంతో తోటి పోలీసులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అయితే ఎమ్మెల్యే సీఐని తోసివేసే దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసులతో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఈ సంఘటనపై ఎమ్మెల్యే జయనారాయణ్ స్పందించాడు. ‘నేను ఆమెను తోయలేదు. ఆమెనే నన్ను తోసింది. పోలీసులపై విరుచుపడుతున్నాననంటూ చెబుతూ ఆమె వెనక్కి నెట్టారు. పోలీసులపై నేను గతంలో ఆరోపణలు చేయడంతోనే నాపై వారు కుట్ర పన్నారు. అసలు ఆమె ఎవరో కూడా తెలియదు’ అంటూ బదులిచ్చాడు. ఈ ఘటనపై సీఐ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉండగా తనపై దుర్భాషలాడాడని, దౌర్జన్యం చేశాడని సీఐ అనిత ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయించారు.
ఈ వ్యవహారంపై అధికారంలో ఉన్న జనతా దల్ పార్టీ (BJD) స్పందించింది. ‘ఇలా బెదిరింపులకు దిగడం జయనారాయణ్ మిశ్రాకు అలవాటే. ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. హత్య కేసుతో పాటు మొత్తం 15 కేసులు అతడిపై ఉన్నాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు’ అని బీజేపీ తెలిపింది. ఒడిశాలో బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ వ్యవహార శైలి ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలోనూ అతడు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడు. కాగా ఎమ్మెల్యేగా అతడిని తొలగించాలని బీజేపీ గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టింది.
Shocked & anguished after seeing this video! A senior leader of Odisha, Shri. Jayanarayan Mishra, physically assaulting & threatening an on-duty Police Officer! I have always stood for equality and this undoubtedly doesn’t define equality at all. Shame!!!@JPNaddapic.twitter.com/07uX6o6Jqt