హైదరాబాద్లో ఇవాళ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,040 వద్ద, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ధర రూ.1,41,200 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, వెండి మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఏకంగా రూ.5,000 పెరిగి కిలో వెండి ధర రూ.2,70,000కు చేరింది. పసిడి కొనేవారికి ఇది మంచి వార్తే అయినా.. వెండి ప్రియులకు మాత్రం భారమే.