NLG: దేవరకొండ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణంకు నిరసనగా శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాటంతో హక్కులు సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ విరుగదిండ్ల శ్రీనివాసులు, వైస్ ఛైర్మన్ ఓరుగంటి రమేష్ ఉన్నారు.