ప్రస్తుతం ‘చాంద్ మేరా దిల్’ షూటింగ్లో ఉన్న అనన్య పాండే, తాజాగా కార్తీక్ ఆర్యన్ సరసన ‘నాగిల్లా’ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు మూడోసారి ఈ జోడీ కలిసి నటిస్తుండటంతో, ఈసారైనా హిట్ కొడతారా లేదా అనే చర్చ బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.