KDP: చెన్నూరు బ్రిడ్జి కింద గుర్తు తెలియని వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. ఆయన సుమారు 65-70 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.