W.G: కమతాలపల్లిలో శ్రీ నిలువులమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.