JN: వెల్ది మోడల్ స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు గణేష్‌కు రాజస్థాన్‌లోని జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ ‘ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డు’ను ప్రకటించింది. ఆంగ్ల భాషా బోధనలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. వెల్ద ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్ చేతుల మీదుగా గణేష్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా గణేష్‌కు పలువురు అభినందనలు తెలిపారు.