యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్ గురించి ఎలాంటి అప్టేట్ లేదు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పోయిన సమ్మర్లో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన అప్డేట్ తప్పితే.. ఇప్పటి వరకు అసలు తెరవెనక ఏం జరుగుతుందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఫిల్మ్ నగర్లో మాత్రం.. ఆచార్య దెబ్బకు కొరటాల ఇంకా స్క్రిప్టు పనుల్లోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయినా అఫీషయల్గా ఇటు ఎన్టీఆర్, అటు కొరటాల టీమ్ నుంచి ఎలాంటి అప్టేడ్ రావడం లేదు. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో డిసప్పాయింట్ అవుతునే ఉన్నారు అభిమానులు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌తో పాటు అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా హీరోయిన్ విషయంలో రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఫలానా ముద్దుగుమ్మ రొమాన్స్ చేయనుందని.. అరడజనుకు పైగానే పేర్లు వినిపించాయి. వారిలో రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ లైన్లోకి వచ్చింది. దాంతో అసలు ఎన్టీఆర్ 30 హీరోయిన్ ఎవరనేది ఓ పట్టాన తేలడం లేదంటున్నారు అభిమానులు. మొత్తంగా షూటింగ్ అప్టేట్తో పాటు హీరోయిన్ విషయంలోను సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది ఎన్టీఆర్ 30. మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.