AP: వివిధ అంశాలపై శిక్షణ కోసం సింగపూర్ వెళ్లిన రాష్ట్ర మంత్రులు, అక్కడి అవర్ టాంపైన్స్ హబ్‌ను సందర్శించారు. థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, మాల్స్, ఫెస్టివ్ ఆర్ట్ థియేటర్లను మంత్రులు పరిశీలించారు. మంత్రుల బృందంలో నారాయణ, అనిత, అచ్చెన్నాయుడు, అనగాని, జనార్ధన్ రెడ్డి ఉన్నారు. అక్కడి ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను సింగపూర్ అధికారులు మంత్రులకు వివరించారు.