‘Ravanasura’ : ‘రావణాసుర’ సెకండ్ సింగిల్ టైం ఫిక్స్!
'Ravanasura' : 'రావణాసుర' సెకండ్ సింగిల్ టైం ఫిక్స్! : హిట్టు, ఫ్లాపులు రవితేజకు కొత్తేం కాదు. అయితే ఫ్లాప్ ఇచ్చిన ప్రతీసారి డబుల్ ఫోర్స్‌తో హిట్ అందుకుంటున్నాడు మాస్ మహారాజా. గతేడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చాయి. అయితే ఏంటి.. అంతకుమించి అనేలా వరుసగా రెండు హిట్లు కొట్టాడు మాస్ మహారాజా.
హిట్టు, ఫ్లాపులు రవితేజకు కొత్తేం కాదు. అయితే ఫ్లాప్ ఇచ్చిన ప్రతీసారి డబుల్ ఫోర్స్‌తో హిట్ అందుకుంటున్నాడు మాస్ మహారాజా. గతేడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చాయి. అయితే ఏంటి.. అంతకుమించి అనేలా వరుసగా రెండు హిట్లు కొట్టాడు మాస్ మహారాజా. ధమాకా 100 కోట్లు, వాల్తేరు వీరయ్య 200 కోట్లు.. మొత్తంగా 300 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రవితేజ దుమ్ముదులిపేశాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు రావణాసురగా రాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ పై.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణసుర’ మూవీ తెరకెక్కుతోంది. ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఏప్రిల్ 7న రావణాసుర థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్, థీమ్ సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. హై ఎనర్జీ సాంగ్‌తో డాన్స్ ఫ్లోర్‌ని ఊపెయ్యడానికి రెడీగా ఉండండి అంటూ, ‘ప్యార్ లోనా పాగల్’ అనే లిరికల్ సాంగ్‌ను, ఫిబ్రవరి 18న రిలీజ్ చెయ్యనున్నట్టు ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ లీడ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మాస్ రాజా నుంచి ‘టైగర్ నాగేశ్వర రావు’ బయోపిక్ రాబోతోంది. ఇదే రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కానుంది. ఆ తర్వాత కార్తిక్ ఘట్టమనేనితో ఓ సినిమా చేస్తున్నాడు. మరి రావణాసురగా రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.