భారత్, కెనడా మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. కెనడా పౌరులపై నేరాలకు పాల్పడే వారికి భారత అధికారులు సహకరిస్తున్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది. వాటిలో ఎంత మాత్రం నిజం లేదని భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో కెనడా ఆరోపణలను సీరియస్గా తీసుకోండని భారత్కు అమెరికా సూచించింది. నిజ్జర్ హత్య కేసు విచారణకు భారత్ సహకరించాలని, కానీ అలా చేయడం లేదని తెలిపింది.