ys sharmila:3700 కిమీ దాటిన పాదయాత్ర..ఉద్యోగాల కల్పనపై తొలి సంతకం
వైఎస్ షర్మిల (ys sharmila) ప్రజా ప్రస్థాన పాదయాత్ర జనగామ నియోజకవర్గంలో 3700 కిలోమీటర్ల మైలురాయి దాటింది. నడిచింది నేనే అయినా..నడిపించింది మీ అభిమానమే అని షర్మిల పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన (jobs) మీద తొలి సంతకం చేస్తానని తెలిపారు.
ys sharmila: వైఎస్ షర్మిల (ys sharmila) ప్రజా ప్రస్థాన పాదయాత్ర జనగామ నియోజకవర్గంలో 3700 కిలోమీటర్ల మైలురాయి దాటింది. నడిచింది నేనే అయినా..నడిపించింది మీ అభిమానమే అని షర్మిల పేర్కొన్నారు. YSR మరణించి 13 ఏళ్లు అయినా.. ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని చెప్పారు. వైఎస్సార్‌కి మరణం లేదని.. మీ అభిమానం చూస్తుంటే అర్థం అవుతుందన్నారు. గొప్ప చదువులు పేద బిడ్డలు చదవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు.పేద కుటుంబంలో జబ్బు చేస్తే పరిస్థితి ఏంటని.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. 5 ఏళ్లలో 46 లక్షల పక్కా ఇళ్లులు కట్టించి ఇచ్చారని వివరించారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్.. ఇప్పుడు ఉన్న సీఎం అని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
మోసగాడు
ఈయన సీఎం కాదు..మోసగాడు.. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని షర్మిల (sharmila) అన్నారు. మూడు ఎకరాల భూమి అని మోసం చేశాడు. పోడు పట్టాలు అని మోసం చేశాడని మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంట్ (free power), ఉచిత ఎరువులు అని మోసం చేశారని పేర్కొన్నారు. రుణమాఫీ (loan) అని మోసం చేశాడని మండిపడ్డారు. చరిత్రలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సాగేది ఫామ్ హౌజ్ పాలన అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని పట్టింపు లేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టింపు లేదన్నారు. దొర 8 ఏళ్ల పాలనలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. పంటకు గిట్టుబాటు ధర ఉండదని విరుచుకుపడ్డారు.
వరి వేస్తే ఉరి అని
వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి సీఎం కేసీఆర్ (kcr) అని ధ్వజమెత్తారు. కళ్లముందే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. 8 ఏళ్లలో భర్తీ చేసింది 65 వేలు మాత్రమేనని చెప్పారు. ఇప్పుడు 50 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ వేశాడని.. అవి ఎప్పుడు భర్తీ అవుతాయో తెలియదని తెలిపారు. ఉద్యమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే రాయొద్దు అని చెప్పారు. స్వరాష్ట్రంలో ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇచ్చారని అడిగారు. ఉద్యమం నా ఊపిరి అని చెప్పి.. ఉద్యమం తప్పా మరోటి లేదని చెప్పి.. తెలంగాణ వచ్చే సరికి మొత్తం కుటుంబం (kcr family) దిగిందని షర్మిల నిలదీశారు. కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు.. జనాలు మాత్రం ఉద్యోగాలు లేక అత్మహత్య చేసుకునే పరిస్థితి అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ (bangaru telangana) కేసీఆర్ కుటుంబానికి అయ్యిందన్నారు. ఒకప్పుడు డొక్కు స్కూటర్లో తిరిగి.. ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎదిగారని మండిపడ్డారు.
దేశం మీద పడ్డ కేసీఆర్
TRS పార్టీ నీ కాస్త brs చేశాడని.. ఈ దరిద్రం ఇక్కడితో చాలదు అన్నట్లు దేశం మీద పడ్డాడని షర్మిల విరుచుకుపడ్డారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున.. కేసీఅర్ మళ్ళీ వస్తాడు.. పిట్ట కథలు చెప్తాడని గుర్తుచేశారు. ఓట్ల (votes) కోసం చందమామ తీసుకు వస్తా అంటాడు.. 8 ఏళ్లుగా కేసీఆర్ (kcr) ఆటలు సాగుతున్నాయని ఫైరయ్యారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిద్ర పోతుందన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు పాదయాత్ర చేస్తున్నాని తెలిపారు. YSR మాదిరిగా సంక్షేమ పాలన అందిస్తానని తెలిపారు. YSR ప్రతి పథకానికి పునర్ వైభవం తీసుకు వస్తామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. లాభసాటిగా మారుస్తానన్నారు. ఇల్లు (home) లేని కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీనిచ్చారు. ఇంట్లో ఎంత మంది అర్హులు ఉంటే అందరికీ 3 వేలు (rs.3 thousand) తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఉద్యోగాల కల్పన (jobs) మీద తొలి సంతకం చేస్తానని తెలిపారు. అక్క,చెల్లెళ్ళకు మాట ఇస్తున్న బెల్ట్ షాపులు రద్దు చేస్తామని స్పష్టంచేశారు.