Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కళ్యాణ్ రామ్
సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టగా అందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆ పాదయాత్రలోనే తారకరత్న(Taraka Ratna) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టగా అందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆ పాదయాత్రలోనే తారకరత్న(Taraka Ratna) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు, సినీ హీరో కళ్యాణ్ రామ్(kalyan ram) స్పందించారు. తారకరత్న కోలుకుంటున్నాడని తెలిపారు.
తారకరత్న(Taraka Ratna) ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, వైద్యానికి సహకరిస్తున్నాడని తెలిపారు. అంతకు మించి తాను ఏం చెప్పలేనని, అలా ఎక్కువ సమాచారం ఇవ్వడానికి తానేమీ మెడికల్ ఎక్స్‌ఫర్ట్ కాదని అన్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్న పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం తనకు ఉందని కళ్యాణ్ రామ్(kalyan ram) తెలిపారు. తన తాజా సినిమా ‘అమిగోస్’ విడుదల నేపథ్యంలో కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తగా అందుకు కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.
నందమూరి తారకరత్న(Taraka Ratna) సినీ కెరీర్ ఎంతో వైభవంగా ప్రారంభమైంది. టాప్ డైరెక్టర్లు రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి వంటివారి గోల్డెన్ హ్యాండ్స్ చేతిలో తారకరత్న పడ్డాడు. దీంతో హీరోగా ఎంట్రీ ఇస్తూనే ఒకే రోజు 9 సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు. ఇది అప్పట్లో అద్భుత రికార్డు అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదు కూడా. అయితే తారకరత్న హీరోగా చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. తారకరత్న 21 సినిమాలు చేస్తే అందలో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు.
సినీ కెరీర్లో తారకరత్న(Taraka Ratna)కు రెండు, మూడు యావరేజ్ హిట్లు మాత్రమే పడ్డాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పెద్దగా ఉన్నప్పటికీ పెద్ద సంస్థలు, దర్శకులతో సినిమా చేసినా కూడా తారకరత్నకు సరైన హిట్లు పడలేదు. అందుకే అందరూ తారకరత్నకు అదృష్టం లేదని అనుకుంటున్నారు. తారకరత్న(Taraka Ratna) యువగళం పాదయాత్రలో గుండెపోటు రావడంతో మొదటగా కుప్పంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి చేయిదాటి పోయిందని భావించి బెంగళూరుకు తీసుకెళ్లారు.
నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. రోజులు గడుస్తున్నా తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదు. కానీ పెద్ద ప్రమాదమైతే తప్పిందని వైద్యులు తెలిపారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్న(Taraka Ratna)కు ఖరీదైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటి వరకూ తారకరత్నకు రూ.80 లక్షలకు పైనే ఖర్చు అయినట్లు సమాచారం. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, టీడీపీ నేతలు దేవున్ని ప్రార్థిస్తున్నారు.