NTR: విజయవాడలోని కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ లక్ష్మీశా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్ పనులను అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, నిరంతర పర్యవేక్షణలో వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన త్రాగునీటి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.