కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ, ఇతర అధికారులతో కలిసి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధునికంగా రూపొందించిన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారంతో కూడిన ఈ క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని కలెక్టర్ సమాచార, పౌర సంబంధాల అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.