కృష్ణా: ఇంజక్షన్ వికటించి పెంపుడు కుక్క మృతిచెందిన సంఘటన మచిలీపట్నంలోని పశు వైద్యశాలలో చోటు చేసుకుంది. గొడుగుపేటకు చెందిన బాలాజీ అనే పశుపోషకుడు తన పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగోకపోవటంతో ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకొచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆ కుక్క మృతి చెందింది. కాలం చెల్లిన ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తన కుక్క మృతిచెందిందని బాలాజీ ఆరోపించారు.