Megastar Chiranjeevi, Ram Charan : మెగాస్టార్, మెగా పవర్ స్టార్.. ఈ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే. మగధీర, బ్రూస్లీ సినిమాల్లో కొద్ది సేపు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు.. ఆచార్యతో మల్టీ స్టారర్ చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసి మెగాభిమానులు పండగ చేసుకున్నారు. బంజారా సాంగ్‌లో ఇద్దరు పోటీ పడి మరీ డ్యాన్స్ చేశారు. గతంలో మగధీర సినిమాలోను బంగారు కోడి పెట్ట సాంగ్‌తో దుమ్ముదులిపారు. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు అదిరిపోయే స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో వేసిన కోల్‌కతా సెట్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ను 200 మంది డాన్సర్లతో చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. అయితే ఈ పాటలో చరణ్ కూడా కనిపించబోతున్నాడట. ఈ సాంగ్ సెట్లో ఫ్యాన్స్‌తో చరణ్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ సాంగ్‌లో చరణ్ కూడా కనిపిస్తాడని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. సెట్స్ నుంచే ఆ ఫోటోలు బయటకి రావడంతో.. మరోసారి చిరు, చరణ్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని నమ్ముతున్నారు మెగా ఫ్యాన్స్. ఇదే నిజమైతే.. భోళా శంకర్‌కు మరింత వెయిట్ పెరిగినట్టే. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.