కడప: జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు బుధవారం పేర్కొన్నారు. స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే అతి తక్కువ ఖర్చులోనే వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల్లోని మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.