కృష్ణా: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు–సేవల పన్నుల వసూళ్లు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.