AP: కేబినెట్ భేటీలో అజెండా అంశాలు ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా సాగు రంగానికి చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. సందర్భం మేరకు తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చల్లో పాల్గొంటామని చంద్రబాబు తెలిపారు. శాఖల వారీగా పద్దులపై జరిగే చర్చలకు మంత్రులు బాగా ప్రిపేర్ కావాలని సూచించారు.