తెలుగు ఓటీటీలో మరో టా షో ‘నిజం విత్ స్మిత’ రాబోతుంది. ఈ నెల 10వ తేదీన చిరంజీవి ఫస్ట్ ఎపిసోడ్ సోని లీవ్‌లో స్ట్రీమ్ కానుంది. దానికి ‘కష్టేపలి అప్ వర్డ్ మొబిలిటీ’ అనే పేరు పెట్టారు. ప్రోమో విడుదల చేశారు. అందులో స్మిత చిరంజీవిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడుగుతారు.. ఆయన మొహం అదోలా పెడతారు. మీ అనుభవంలో అవమానాలు అని అడగగా.. తనకు జగిత్యాలలో అవమానం జరిగిందని చెప్పారు. ముందు పూల వర్షం కురిసిందని.. ఆ తర్వాత కోడిగుడ్లతో దాడి జరిగిందని చెప్పారు. వరప్రసాద్ నుంచి మెగాస్టర్ అయ్యే సిచుయేషన్ ఉందా అని మరో ప్రశ్న వేశారు స్మిత.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నటులు నాని, రాణా, అడవి శేష్, సాయి పల్లని కూడా స్మిత ఇంట్వర్యూ చేశారు. దానికి సంబంధించిన వీడియోను సోని లివ్ వదిలింది. నిజం విత్ స్మిత అనే టాక్ షోకు నిజం నిర్భయంగా అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. చంద్రబాబును మాటకు ముందు వెన్నుపోటు అని అంటారు అనగా.. తెలంగాణ సీఎం కూడా భాగస్వామి అని సమాధానం ఇచ్చారు. చరణ్ సినిమాను కోటి మంది చూశారు.. చూసినవారే కదా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసింది అని నాని అన్నారు. సినిమా వల్ల సమాజం చెడిపోతుందని తప్పు అని దర్శకుడు దేవ కట్టా సమాధానం ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషించడం ఏంటీ అని సాయి పల్లవి గొంతెత్తారు. అప్పట్లో హీరోయిన్లకు విలువ ఉండేదని రాధిక చెప్పుకొచ్చారు.
టాలీవుడ్లో దాగిన చీకటి కోణాన్ని స్మిత వెలుగులోకి తీసుకొస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. టాక్ షోకు వచ్చిన వారిని మాత్రం నిర్మోహమాటంగా ప్రశ్నలు అడిగేస్తున్నారు. ఈ షోకు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరణ చూపిస్తారో చూడాలి.