ASR: రోజువారీ హాజరు నమోదు చేయకుండా, సమయపాలన పాటించకుండా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయాలని కలెక్టర్ దినేష్ కుమార్, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి కుమార్ను మంగళవారం ఆదేశించారు. పర్యవేక్షణ చేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు.