ఈ వారంలో నాలుగు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అమిగోస్, పాప్ కార్న్, వసంత కోకిల అనే సినిమాలు.. ఫిబ్రవరి 10న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే ఒక రోజు ముందే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘వేద’ రాబోతోంది. ఇక ఈ సినిమాల్లో అమిగోస్ తప్పితే మిగతా వాటికి ఏ మాత్రం బజ్ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అమిగోస్‌తో మూవీతో.. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇంతకుముందు బింబిసార సినిమాతో మల్లిడి వశిష్టను డైరెక్టర్‌గా పరిచయం చేసి.. సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. అందుకే అమిగోస్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం ఒకటైతే.. సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండడంతో.. ‘అమిగోస్’ మరింత ఆసక్తికరంగా మారింది. పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం, మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ప్లానింగ్.. సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. అలాగే కళ్యాణ్ రామ్‌కు మాస్ ఇమేజ్ ఉండడంతో.. అమిగోస్‌కు తిరుగులేనట్టే. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌కు.. ఖచ్చితంగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. మొత్తంగా ఎటు చూసినా కళ్యాణ్ రామ్‌కి అన్నీ కలిసొచ్చినట్టే కనిపిస్తుంది. కాబట్టి.. ఈ వారం అమిగోస్దేనని చెప్పొచ్చు. మరి ట్రిపుల్ రోల్‌తో కళ్యాణ్ రామ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.