Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్.. రెండు సీక్వెల్స్!
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సీక్వెల్స్ బాట పట్టాడు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో సీక్వెల్ ప్రకటించాడు. మరి ఈ రెండింటిలో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
Kalyan Ram: హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్.. ఈ వారం ‘డెవిల్’గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడని అంటున్నారు. దీంతో.. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్‌కు మరో హిట్ పడిపోయింది.
ఇక సినిమా హిట్ అవ్వడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక సెలబ్రేషన్స్‌లో భాగంగా.. డెవిల్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ‘డెవిల్ 2 ఉంటుంది. నా టీమ్ మెంబర్స్‌తోనే ఉంటుంది. 2024లో డెవిల్ 2 మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం. డెవిల్2 లో 1940 ఎరా.. 2000 ఎరా కూడా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలు కలిపి చూడబోతున్నారు..’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. ఇప్పటికే బింబిసార 2 కూడా అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. కానీ ఈ సినిమా తర్వాత రెండు సినిమాలొచ్చాయి.
అమిగోస్ ఫ్లాప్ అవగా.. డెవిల్ ఓకె అనిపించుకుంది. ఇక ఇప్పుడు డెవిల్ 2 అనౌన్స్ చేశాడు. కానీ డెవిల్ ట్రైలర్ లాంచ్‌లో.. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో బింబిసార 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో.. ఈ రెండు సీక్వెల్స్‌లలో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే NKR21 వర్కింగ్ టైటిల్‌తో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఆ తర్వాత బింబిసార 2 చేస్తాడా? డెవిల్ 2 తీస్తాడా? అనేది చూడాలి.