భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్(13)(Natasha Perianayagam) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఎంపికైంది. ఆమె తాజా ప్రయత్నంలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. పరీక్షలకు 76 దేశాల నుంచి హాజరైన 15,300 మంది అభ్యర్థులలో 27 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించగా..నటాషా మాత్రం టాప్ లో నిలిచింది. ఈ పోటీలను యునైటెడ్ స్టేట్స్కు చెందిన జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (CTY) నేతృత్వంలో నిర్వహించారు.
నటాషా న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడిల్ స్కూల్ విద్యార్థి. ఆమె 5వ తరగతి చదువుతున్నప్పుడు 2021లో అదే పరీక్షకు హాజరైంది. ఆ పరీక్షలో, నటాషా వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో – అడ్వాన్స్డ్ క్లాస్ 8 ప్రదర్శనలలో 90వ పర్సంటైల్‌తో సమానంగా రాణించి గౌరవాన్ని పొందింది. కానీ ఈసారి మాత్రం గతంలో కంటే మెరుగ్గా CTY టాలెంట్ సెర్చ్‌లో భాగంగా తీసుకున్న అసెస్మెంట్లతో సహా అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. దీంతో గతంలో ఈ పోటీల్లో ఛాన్స్ దక్కించుకున్న నటాషా ఈసారి మాత్రం ఏకంగా ప్రథమ స్థానంలో నిలిచింది. నటాషా తల్లిదండ్రులు చెన్నైకి చెందినవారు కాగా..ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు.