వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లకు భారత్లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ప్లస్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అయితే చాలు.. భారత్ మార్కెట్లో ఫోన్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. తాజాగా వన్ ప్లస్ బ్రాండ్ నుంచి 11 మోడల్ 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేశారు.
2023 లో వన్ ప్లస్ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ ఒక వేరియంట్, 12 జీబీ ప్లస్ 256 జీబీ మరో వేరియంట్. రెండు కలర్స్ వేరియంట్లలో లభిస్తుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. వన్ ప్లస్ ఆన్ లైన్ స్టోర్, రిటైల్ పార్టనర్స్ ద్వారా ఫోన్ను కొనుగోలు చేయొచ్చు.
8 జీబీ వేరియంట్ ధర రూ.56,999 కాగా, 12 జీబీ వేరియంట్ ధర రూ.61,999 గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్, ఏఎంవో ఎల్ఈడీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్వోసీ, హాసెల్ బ్లాడ్ తో ట్యూన్ చేసి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ, 48 ఎంపీ, 32 ఎంపీ రేర్ కెమెరా సెటప్ తో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5జీ నెట్ వర్క్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది.