Google Features: మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా గ్రామర్ చెకింగ్ ఫీచర్‌ను ఇంగ్లీష్ భాషలో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే అన్ని భాషల్లో ఈ ఫీచర్ రానుంది.
టెక్నాలజీ(Technology) పెరిగే కొద్దీ నూతన ఆవిష్కరణలు ప్రజల ముందుకు వస్తూనే ఉంటాయి. గూగుల్ (Google) వచ్చాక ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతోంది. చాలా మంది గూగుల్ తల్లిని నమ్ముకునే తమ వర్క్‌లు సాఫీగా కానిచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ తమ యూజర్ల(Users) కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తూ ఉండటం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ సరికొత్త ఫీచర్(New Features)ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
సాధారణంగా మెయిల్స్(Mails)లో, వాట్సాప్(Watsapp)లో నోట్ రాస్తుంటాం. అయితే అందులో వ్యాకరణ ధోషాలు రావచ్చు. వాటి వల్ల చాాలా మంది ఎదుటివారి ముందు చులకన అయ్యే పరిస్థితి ఉంది. అందుకే గూగుల్ వ్యాకరణ తనిఖీ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్డేట్(Update) ద్వారా తప్పులు లేకుండానే వాఖ్య నిర్మాణం చేపట్టవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలో అన్ని భాషల్లోకి దీనిని తీసుకొచ్చే ప్రయత్నం గూగుల్ చేస్తోంది.
ఈ ఫీచర్(Feature)ను సులభంగా ఉపయోగించవచ్చు. ముందుగా గూగుల్ సెర్చ్(Google Search) ఇంజిన్‌లో గ్రామర్ చెక్ ఫీచర్ ఉంటుంది. మనం గూగుల్ సెర్చ్‌లో ఏదైనా పదాన్ని తప్పుగా పేస్ట్ చేస్తే గ్రామర్ చెక్ ఫీచర్ ద్వారా చూడొచ్చు. అక్కడ సెంటెన్స్ కాపీ లేదా టైప్ చేస్తే ఇంకో బాక్సులో వ్యాకరణ దోషాలు లేని వాఖ్యాన్ని చూడొచ్చు. స్పెల్లింగ్ లోపాలను కూడా సరిచేయవచ్చు. అయితే గూగుల్ కంటెంట్ నిబంధనలకు అనుగుణంగా మనం సర్చ్ చేసే కంటెంట్ ఉండాలి. అలా లేనివాటికి గూగుల్ వ్యాకరణ తనిఖీ జరగదని ఈ టెక్ దిగ్గజం హెచ్చరించింది.