NLG: చిట్యాలలో వార్డుల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో సీనియర్ నేతల ఆశలు ఆవిరయ్యాయి. మొత్తం 12 వార్డుల్లో తమకు అనుకూలమైన రిజర్వేషన్లు వస్తాయని భావించిన ఆశావహులు.. తాజా ప్రకటనతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు.