ELR: అప్పుల బాధతో ఓ వ్యవసాయాధికారి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. తంగెళ్లమూడి పుష్పలీల నగర్‌కు చెందిన గోగులమూడి రాజు (53) కొంతకాలంగా మద్యానికి బానిసై విధులకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే అప్పుల పాలై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 15న ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.