SRD: పటాన్చెరులోని హజరత్ సయ్యద్ మురాద్ అలీ షా దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా లియాకత్ అలీ గంధం (సందల్) ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మోసిన్, వాజిద్ అలీ, ఖాజా కాక, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.