అనకాపల్లి: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిని మున్సిపల్ మంచినీటి విభాగం ఏఈ గణపతిరావు సోమవారం ఉదయం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో నెహ్రు నగర్ ఎస్సీ కాలనీలో తాగునీటిలో క్లోరిన్ శాతం పరిశీలించినట్లు తెలిపారు. ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటిలో క్లోరిన్ శాతం 1.00 పీపీఎం ఉన్నట్లు తెలిపారు.