గత వారంలో లాగే ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరోలదే హవా కొనసాగనుంది. అయితే ఈ సారి ముగ్గురి మధ్యే పోటీ నెలకొంది. ఆ ముగ్గురికి కూడా ఈ సినిమాల రిజల్ట్ ఎంతో కీలకం కానున్నాయి. అందరూ కూడా ఫ్లాఫ్స్లోనే ఉన్నారు. వాస్తవానికి ఈ వారం చాలా సినిమాలే రిలీజ్ కానున్నాయి. కాకపోతే ముగ్గురు హీరోలకే కాస్త ఫాలోయింగ్ ఉంది. నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’.. శ్రీవిష్ణు ‘అల్లూరి’.. కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రాలపై మంచి బజ్ ఉంది. దాంతో బాక్సాఫీస్ సందడి ఇంట్రెస్టింగ్గా మారింది. గత కొంత కాలంగా సరైన హిట్ లేని నాగశౌర్య నుంచి తాజాగా ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న శౌర్య.. ఈ సినిమా కోసం పాదయాత్ర చేసి మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఇక విభిన్న సినిమాలతో అలరిస్తున్న శ్రీ విష్ణు.. ఇప్పుడు ‘అల్లురి’గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ‘రాజ రాజ చోర’ తర్వాత డీలా పడిపోయిన ఈ యంగ్ హీరో.. అల్లు అర్జున్ ప్రమోషన్స్తో అంచనాలు పెంచేశాడు. ఇక ‘మత్తువదలరా’ మూవీతో ఆకట్టుకున్న శ్రీ సింహను.. ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా నిరాశ పరిచింది. అందుకే ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే థ్రిల్లర్ మూవీతో వచ్చాడు. ఈ సినిమా రాజమౌళి మార్పులతో థియేటర్లోకి వచ్చింది. ‘దొంగలున్నారు జాగ్రత్త’ రాజమౌళి చూశాడని.. ఆయనకు నచ్చిందని.. చిన్న చిన్న మార్పులు కూడా సూచించారని.. ఆ మార్పులతోనే రిలీజ్ అవుతోందని.. చెబుతున్నాడు శ్రీసింహ. దాంతో ఈ సినిమా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ ముగ్గురిలో ఎవరు హిట్ కొడతారో చూడాలి.