అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పై భారీగా అప్పుల భారం మోపుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శల ధాటి పెంచారు. జనసేన సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీలో అప్పులు పెరుగుతుండడంపై మంగళవారం తనదైన శైలిలో పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.55,555 కోట్లకు చేరింది. ఇది కేవలం ఒక్క తొమ్మిది నెలల వ్యవధిలోనే చేయడం గమనార్హం. దీనిని ఉద్దేశించి ఒక కార్టూన్ ను జనసేన పార్టీ విడుదల చేసింది. అనంతరం ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ‘అప్పులతో ఏపీ పేరు మార్మోగిస్తున్నందుకు సీఎం జగన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్ర పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరి మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలి’ అని వ్యంగ్యంగా తెలిపారు.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍 P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCMpic.twitter.com/bnZEOHdMFa